Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    గారడీ, మూఢ విశ్వాసము

    గార సంబంధమైన పుస్తకములన దగ్దము చేయుట ద్వారా ఎఫెస్సీ విశ్వాసుల ఒకప్పుడు తమ కానందమును కూర్చిన విషయమును ఇప్పుడు అసహ్యించుకొనుచున్నామని చూపిరి. గారడీ వలన గారడీ ద్వారా వారు ప్రత్యేకముగా దేవుని నొప్పించి తమ ఆత్మలకు అపాయము తెచ్చుకొనిరి. వారు గారడీ విద్య పట్ల తమ ఉగ్రతను చూపిరి. అట్లు వారు తమకు కలిగిన నిజమైన మార్పుకు నిదర్శనము చూపిరి. CChTel 491.4

    ఇరువదియవ శతాబ్దపు నాగరికతకు ముందు అన్య మూఢ విశ్వాసము మాయమైనదని, ఊహించబడుచున్నది. కాని దైవవాక్యము, జరుగుచున్న వాటి యొక్క నిష్కర్ష సాక్ష్యము పూర్వకాలపు గారడీ గాండ్రవలెనే ఈ యుగమందుకూడా మంత్ర అనుష్టానము సాగుచున్నదని తెలుపుచున్నది. వాస్తవముగా పురాతన గారడీ విద్య నవీన భూత శాస్త్రము వంటిదే. గతించిపోయిన స్నేహితుల వేషములో వచ్చి సాతానుడ వేలకొలది ప్రజల మనస్సులలో చొరబడుచున్నాడు. అయితే చచ్చిన వారు ఏమియు ఎరుగరు అని లేఖనములు వివరించుచున్నవి. ప్రసంగి 9. 5 వారి తలంపుల, ప్రేమ, ద్వేషము, అంతరించినవి. మృతులు జీవితులతో సంభాషింపరు. కాని కుయుక్తి పరుడగు సాతానుడు మానవ మనస్సులను స్వాధీన పర్చుకొనుటకే యీ పన్నాగములు పన్నుచున్నాడు. CChTel 492.1

    భూత విద్య ద్వారా పెక్కు మంది రోగులు, విచారగ్రస్తులు పెక్కు మంది రోగులు, విచారగ్రస్తులు, వింతపడువారు దురాత్మలతో సంభాషించుచున్నారు. ఇది చేయ సాహసించువారందరు అపాయమందున్నారు. వారిని దేవుడెట్లు పరిగణించుచున్నాడో దైవవాక్యము విశద పరుచున్నది. అన్యమతస్థుడగు ఒక సోదెగాని కడకు సలహా నిమిత్తము కబురు పంపిన ఒక రాజు మీదికి పూర్వకాలము దేవుడు భయంకరమగు తీర్పు పంపించెను. ఇశ్రాయేలు వారిలో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతయై న బయల్జెబూబు నొద్ద మీరు విచారించబోవు చున్నారా? కాగా యెహోవా సెలవిచ్చునదేమనగా నీవెక్కిన మంచము మీద నుండి దిగకుండ నీవు నిశ్చయముగా మరణమవుదువు. 2 రాజులు 1. 3,4CChTel 492.2

    అన్యమత కాలపు గారడీగాండ్రు నేటి భూత శక్తి ద్వారా కనికట్టు కట్టువారు, సోదెగాండ్రవంటివారే. ఎండోరు, ఎఫెసీలలో వినబడిన మర్మ స్వరములు ఇప్పుడు సయితము మానవులను తప్పు త్రోవను నడుపు చున్నవి. మన నేత్రముల ముందున్న తెర తొలగించబడగలిగినచో మోసగించ నాశనము చేయుకు తమ శక్తి సామర్థ్యములను వినియోగించుచున్న దుష్ట దూతలను మనము చూడగలము. దేవుని మరపించు పలుకుబడి ఎక్కడ నున్నదో అక్కడ సాతాను తన మంత్ర శక్తిని ఉపయోగించుచున్నాడు. మానవులాతని పలుకుండికి లొంగినచో తాము గుర్తించకముందే వారు మోసగించబడెదరు. వారి ఆత్మ అపవిత్ర పర్చబడును. ఎఫెస్సీ సంఘమునకు అపోస్తులుడు చేసిన హెచ్చరికను నేటి దైవ ప్రజలు అనుసరించ వలెను. “నిష్ఫలమైన అంధకార క్రియలతో పాలివారై యుండక వాటిని ఖండించుడి. ”ఎఫెస్సి 5:11. 5AA 288-290;CChTel 492.3