Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    విశ్వాసి వర్తకము నందుత్తమ వ్యక్తి

    క్రీస్తు కొలమానము ప్రకారము స్థిరమైన యధార్థత కలవాడే నమ్మకమైన పురుషుడు. అబద్ధపు కొలతలు, తప్పుడు త్రాసులతో లోకములో లాభము పొంద జూచువారు దేవుని దృష్టికి హేయమైన వారు. అయినను దేవుని ఆజ్ఞలను గైకొన్నామని చెప్పువారనేకులు తప్పుడు కొలతలను, త్రాసులను ఉపయోగించు చున్నారు. ఒక వ్యక్తి దేవునితో సంబంధము కలిగియుండి ఆన ధర్మశాస్త్రములను యధార్థముగా కాపాడు చున్నపుడు ఆ విషయమును అతని జీవితమే వ్యక్త పరచును. ఏలయనగా అతని కార్యములన్నియు క్రీస్తు బోధలకు లోనైయుండును. లాభము కొరకు తన ప్రతిష్టనతడు విక్రయింపడు. అతని నియమములు నిశ్చితమైన పునాదిపై ఆనుకొని యుండున. తన ప్రపంచ వ్యవహారము లన్నింటిలోను తన నియమములు ప్రతిఫలించును. ప్రాపంచిక మైన చెత్త చెదారము మధ్య బంగారమువలె పటిష్టమైన యధార్థత ప్రజ్వలించును. CChTel 223.3

    మోసము, అబద్ధము, అపనమ్మకములు, మానవ నేత్రములకు మరుగుపర్చబడవచ్చును. గాని దేవుని నేత్రములకు మరుగు పర్చబడజాలవు. శీలముయొక్క పెరుగుదలను పరిశీలించి నైతికా మూల్యమునుగుణించు దేవదూతలు శీలమును ఎరుక పరచు ఈ స్వల్ప కార్యములను పరలోక గ్రంధములలో దాఖలు చేసెదరు. ఒక కార్మికుడు తన దిన కృత్యముల యందు అపనమ్మకముగా నుండి తన కీయబడిన పనిని అలక్ష్యము చేయగా వ్యాపారమందతని ప్రమాణమును బట్టి యాతని మత ప్రామాణికతను నిర్ణయించుట తప్పుగా పరిగణింపబడదు. CChTel 224.1

    మనుష్యకుమారుడు మేఘారూఢుడై వచ్చునను నమ్మిక క్రైస్తవులను తమ సామాన్య జీవిత వ్యవహారములలో అలక్ష్యముగను, ఆషామాషిగను ఉండునట్లు చేయదు. క్రీస్తు త్వరితాగమనము నపేక్షించు వారు సోమరులుగా నుండరు గాని తమ కార్యకలాపము లలో శ్రద్ధ గలిగి యుందురు. వారు తమ కార్యములను అజాగ్రత్తగను, అపనమ్మకముగను చేయక నమ్మకముగాను చురుకుగాను నిరాక్షేపణీయము గాను నిర్వహించెదరు. ఈ జీవితమునకు సంబంధించిన కార్యములు అలక్ష్యము చేయుట తమ ఆధ్యాత్మికాభ్యున్నతికై లోకము నుండి వేరుపడినా మనుటకు తార్కాణమని ప్రగల్పములు పలుకువారు గొప్ప మోసమందున్నారు. వారి యథార్ద్యము, నమ్మకము, నిజాయితీలు ఐహిక విషయముల యందు పరీక్షింప బడును. మిక్కిలి అల్పమైన దానియందు నమ్మకముగా నుండువారు గొప్పదానియందు గూడ నమ్మకముగా నుందురు. CChTel 224.2

    అనేకు లిక్కడనే తప్పిపోవుదరని నాకు చూపబడెను. ఐహిక కార్య నిర్వహణ మందు వారు తమ నిజశీలమును స్థాపించు కొనెదరు. తోడి మానవులతో తమ వ్యవహారములలో వారు తమ అపనమ్మకమును, కుతంత్రమును, మోసమును కనపర్చెదరు. ఈ జీవిత వ్యవహారములలో తాము ప్రదర్శించు ప్రవర్తనపై తమ భావి అమర్త్యజీవితము ఆధారపడి యున్నదనియు, పవిత్ర శీలము ఏర్పడుటకు స్వచ్ఛమైన యధార్థత అత్యవసర మనియు వారు తలంచరు. సత్యమును నమ్ముచున్నామని చెప్పుకొను అనేకులలోని నులివెచ్చని తనమునకు. .. అపనమ్మకమే కారణ ము. వారు క్రీస్తుతో జతపర్చబడలేదు, వారు తమను తామే మోసగించుకొను చున్నారు. సబ్బాతు నాచరించు వారి యందు సహితము యధార్ధత విశేషముగా కొరవడి యున్నదని చెప్పుట నాకు చాల బాధ కరముగా నున్నది. 64T 309-311;CChTel 224.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents