Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    ఆయన ఇచ్చు ఆదాయములో పదియవ భాగము దేవుడు కోరుచున్నడు

    దశమాంశ వ్యవస్థ మోషే కాలముకన్న పురాతనమైనది. దేవుడు మోషేకు నిర్దిష్ట పద్దతి నీయక పూర్వముకూడ మత విషయములు నిమిత్తము అర్పణలు చల్లించవవెనని తన ప్రజలకు ఆయన కోరెను. ఆదాము కాలమునుండికూడ ఇది జరిగెను. వారు దైవ విధులను నెరవెర్చులో తమపై ఆయన చూపిన కృపను, కుమ్మరించిన దీవెనలను, కానుకలిచ్చుగద్వారా అభినందించవలసి యుండిరి. తమ తరములవారు దీనిని అనుసరించిరి. ఆబ్రహాము కూడ దీని నాచరించెను. మహొన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కెసెదెకుకు అబ్రహాము దశమ భాగములు చెల్లించెను. యోబు కాలమున కూడ నిదే కట్టడ అమలులో నుండెను. యాకోబు పరవాసియై తిరుగుచు ఒక రాతిని తలక్రింద పెట్టుకొని ఒంటిగా రాత్రి యుందు బేతేలువద్ద ఏమియు పైకము లేనివడె నిద్రించుచుండగా ప్రభుకిట్ల వాగ్దానము చేసెను: “మరియు నీవు నాకిచ్చిన యూవత్తులో పదియవవంతు నిశ్చయముగా నీకు చెల్లించెదను,” అది 28:22. ఇయ్యుడని మానవులను దేవుడు బలత్కారము చేయుడు. వారు స్వేచ్ఛార్ఫణల నీయవలెను. అయిష్టముగా నిచ్చుకానుకలతో ఆయన ధనాగామును నింపుకొనుడు. CChTel 114.1

    తాను కోరినది ఆదాయములో పదియవ భావమని ప్రభువు నిర్థేశించుచున్నాడు. దశ మంశ పద్దతిపట్ల స్వేచ్ఛావర్తగల ప్రజల దయాళుత్వమునకును, మనస్సాక్షికిని ఇది విడిచిపెట్టబడినది. ఇది మనస్సాక్షికి విడిచిపెట్టబడగా అందరికి సుస్పష్టమగు కచ్చితమగు ఒక ఏర్పాటు కావించబడి యున్నది. ఒత్తిడి అక్కరలేదు. CChTel 114.2

    మోషే కలమునందలి ప్రజలు తమ ఆదాయమందు పదియవభాగము నీయవలెనని దేవుడు కోరెను. ఈ జీవిత వస్తు సముదాయమును అభివృద్ది పరచి తిరిగి తనకీయవలసిన తలాంతులుగా వారికి ఆయన అప్పగించెను. పదియవ భాగము నాయన కోరుచున్నడు. కనీ సము మానవుడు ఇంతైనను చెల్లించవలెనని ఆయన ఆజ్ఞాపించున్నాడు. ఆయన ఇట్లు సెలవిచ్చుచున్నడుÑ పదింట తొమ్మిది పాళ్లు నీకిచ్చి కడమ ఒక పాలునే కోరుచున్నాను. అది నాకు మానవులు దేవునికియ్యక ఈ దశమ భాగమును నిలుపు చేసినచో వారు దేవునిని దొంగిలించుచున్నట్లే. ఆ కాలములో ఆదాయములో పదియవ భాగమేకాక, పాపపరిహారార్థపుకానుకలు, సమాదానర్పణలు, కృతజ్ఞతార్పణలు కూడ అర్పించవలసి యుండిరి. CChTel 114.3

    దేవునికి చెందు దశమ భాగమును చెల్లించక అపుచేయనదంతయు పరలోక గ్రంథమలందు నిలుపు చేసిన వ్యక్తుల పేర్లను ఎదురుగా దొంగతనమని వ్రాయబడును. సృష్టి కర్తను దోచుకొనువారు ఇట్టివారే. అశ్రద్దవలన జరిగిన ఈ పాపము తమకు కనపర్చబడిన ప్పటినుండి సరియైన విధముగా దశమ భాగము చెల్లించుటమాత్రమే చాలదు. కొంతకాలము తమ ఆదీనమందుంచి పిదప దేవునికి తిరిగి అప్పజెప్పుటకై యియ్యబడిన దానిని భుక్తము చేసికొన్నందుకు పరలోక గ్రంధములలో వ్రాయబడిన లెక్కలను ఇది సరిదిద్దజాదు. దేవుని యొడల అపనమ్మకముగా ప్రవర్తించి కృతఘ్నలై యున్నందులకు పశ్చాత్తాపము అవసరము. CChTel 115.1

    ఏ కాలమందు ప్రపంచములో నివసించిన జనులైనను సంతోషముతోను, మన:పూర్తిగాను దేవుని ఏర్పాటులను జరిగించి తమ ధనముతో ఆయనను ఘనపరచుచు ఆయన విధులను కాపాడిన వారి కొట్టులు కొరతకేకుండా నింపబడినవి. దశమ భాగములలోను చందాల లోను వారు దేవుని దోచుకొన్నచో వారు దేవునినేగాక తమ్మును తామే దోచుకొనుచున్నారని గుర్తించునట్లు చేయబడిరి. ఏలయనగా వారాయనకిచ్చిన కానుకలలో వెనుదీసిన పరిమాణమునుబట్టియే ఆయన దీవెనలనిచ్చుటలరో వెనుతీసెను. 133T 393-395;CChTel 115.2

    దురదృష్టవంతుడై అప్పులపాలైన వ్యక్తి తన అప్పులను తీర్చుకొనుటకు ప్రభుని భాగము తీసెకోనరాదు. ఈ కార్యములయందతడు పరిక్షించబడుచున్నాడనియు ప్రభువు భాగమును స్వప్రయోజనమునకు ఉంచుకొనుటద్వారా ప్రభువునతడు దోచుకొనుచున్నాడనియు తలంచవలెను. తనకున్న సమస్తము విషయమై దేవునికితడు ఋణస్థుడు. కాని దేవుని భాగమున తన అప్పుల నిమిత్తము ఇతరుకిచ్చినచో రెండు రెట్ల ఋణస్థుడగును. పరలోక గ్రంధములో నతని పేరుకు ఎదురుగా, “దేవుని యెడల అపనమ్మకము” అని లభించబడును. స్వలాబాము కొరకు దేవుని ధనమును వినియోగించుకొన్నందున ఆయనతో పరిష్కరించుకొనవసిన బాకీ ఒకటి మానవునికి గలదు. దేవుని ధనమును భుక్తము చేసికొనుటద్వారా చూపిన నియమ రాహిత్యత తన యితర కార్యనిర్వహణములోకూడ బయలు పడును. తన వ్యాపార విషయములన్నింటియందును ఇది ఆగపడును. దేవుని సొత్తును దొంగలించి మనుష్యుడు దైవ కుటుంబ ప్రవేశమునుండి తనను వేరుచేయు గుణశీలమును అలవరచుకొనుచన్నాడు. 146T 391;CChTel 115.3