Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    శ్రీమతి ఇ. జి. వైటమ్మగారి జీవితమ, సేవ

    అమెరికా సంయుక్త రాష్ట్రములలో ఈశాన్య దిశనున్న మెయిన్‌ రాష్ట్ర మందలి గోర్హామను పట్టణమందు నవంబరు 26, 1827వ సంవత్సరమున ఎలెన్‌ జి. హార్మన్‌ ఆమె కవల చెల్లెలు జన్మించిరి. తొమ్మిది సంవత్సరముల ప్రాయమపుడు ఎలెన్‌కు ఒక ప్రమాదము సంభవించినది. ఆమె సహ విద్యార్థిని అనాలోచితముగా ఒక రాయి విసరినందున ఆమెకు అపాయము వాటిల్లెను. ముఖముపై ప్రాణాంతకమైన గాయము ఏర్పడగా ఆమె బలహీనురాలాయెను. తత్పర్యవసానముగా ఆమె విద్యాభ్యాసనమునకు ఆటంకము కలిగెను. CChTel 26.2

    తన పదకొండవ ఏట ఆమె తన హృదయమును దేవునికిచ్చెను. కొంత కాలమైన పిదప ఆమె మునక బాప్తీస్మము పొంది మెతడిస్టు సంఘసభికురాలాయెను. తన కుటుంబ సభ్యులతోపాటు ఈమె కూడ పోర్టులాండ్‌,(మెయిన్‌ స్టేట్‌)లో జరగుతున్న ఎడ్వంటిస్టు కూటములకు హాజరై విలియమ్‌ మిల్లర్‌గారు, ఆయన సహచరులు క్రీస్తు ద్వితీయాగమన సామీప్యమును గూర్చి వెలిబుచ్చిన ధృక్పథములను అంగీకరించి రక్షకుని ఆగమనము కొరకు నమ్మకముతో ఎదురు చూచెను. CChTel 26.3

    1844వ సంవత్సరము డిశంబరు మానములో ఒక ఉదయము నలుగురు స్త్రీలతో కలిసి ప్రార్థించుచుండగాఆమెపైకి దేవుని శక్తి వచ్చెను. ముందు ఆమెకు దేహజ్ఞప్తి లేకపోయెను. పిమ్మట ఆలంకారిక దర్శనములో పరిశుద్ధ పట్టణమునకు ఎడ్వెంటిస్టు ప్రజల ప్రయాణమును, నమ్మకముగానున్న వారికియ్యబడు బహుమానమును ఆమె చూచెను. భయముతోను వణుకుతోను ఈ దర్శనమును, తరువాత కలిగిన దర్శనములను గూర్చి ఈ పదిహేడేండ్ల బాలిక పోర్టులేండ్‌లోని తన సహవిశ్వాసులకు నివేదించెను. పిదప అవకాశము చిక్కినప్పుడు ఈ దర్శనమును గూర్చి మెయిన్‌ రాష్ట్రమందు, దానికి సమీపమందున్న ఇతర రాష్ట్రములందునుగల ఎడ్వంటిస్టులకు ఆమె వ్యక్తము చేసెను. CChTel 26.4

    1846 సం॥ ఆగస్టు మాసమందు ఎలెన్‌ హార్మన్‌ జేమ్సు వైటులకు వివాహము జరిగినది. జేమ్సు వైట్‌ ఒక యువక ఎడ్వంటిస్టు సువార్తికుడు. ఆగస్టు 6, 1881 సం॥లో జేమ్సు వైటు మరణించువరకుగల 35 సంవత్సరములలోశ్రీమతి వైటమ్మగారు తన భర్తకు చేదోడువాదోడై కష్టంచి సువార్త సేవ చేసిరి. బోధించుచు, గ్రంథములను వ్రాయుచు, ఆలయములను నిర్మించుచు, సంఘములను వ్యవస్థీకరించుచు, వానికి సక్రమపాలనము ఏర్పరచును వారు సంయుక్త రాష్ట్రములలో అనేక ప్రదేశములు పర్యటించిరి. CChTel 27.1

    ఎల్డరు వైటు గారు, వారి సతీమణి, అనుచరబృందము వేసిన పునాదులు ఎంత బలమైనవో, విశాలమైనచో, వారు ఎంత జ్ఞానయుతముగా నిర్మాణమును సాగించిరో కాలపరీక్షలే నిరూపించినవి. సబ్బాతు నాచరించు ఎడ్వంటిస్టులను వారు నడిపించి 1849-1850 సంవత్సరములలో ప్రచురణశాఖను నెలకొల్పిరి. 1858, ‘59 ప్రాంతములో సంఘమును, సంఘమునకు సుస్థిర ఆర్థికవ్యవస్థను ఏర్పాటు చేసిరి. దీని పర్యవసానముగా 1863వ సంవత్సరమున జనరల్‌ కాన్ఫరెన్సు వ్యవస్థీకరించబడినది. 1865, ‘66 సంవత్సరములలో మన వైద్య సేవ ప్రారంభమైనది. 1870, ‘71 ప్రాంతములో మతశాఖయొక్క విద్యాకృషి ప్రారంభమైనది. సాంవత్సరిక శిబిర కూటము జరుప పద్ధతి 1868లో ఉనికిలోకి వచ్చినది. 1874లో సెవెంతుడే ఎడ్వంటిస్టు వారు తమ ప్రథమ విదేశ మిషనెరీని పంపిరి. CChTel 27.2

    శ్రీమతి ఇ. జి. వైటమ్మ గారి ద్వారా దేవుడు ఈ ప్రజలకు వాక్కుద్వారాను, వ్రాతమూలంగాను ఇచ్చిన ఉపదేశముల ప్రకారము ఈ పరిణామములు రూపొందినవి. CChTel 27.3

    ఆదిలో ఉపదేశము లెక్కువ భాగము వ్యక్తిగత లేఖల రూపేణా వ్రాయబడినవి. లేక మన మొదటి పత్రికjమైన “తత్కాల సత్యము” లో వ్యాసములద్వారా ఉపదేశము అందించబడినది. 1851లో వైటమ్మగారు 64 పుటలలో “ఎలెన్‌ జి. వైటమ్మగారి క్రైస్తవానుభవము, ఉపదేశము” అను నామముతో తమ ప్రథమ గ్రంథమును ప్రచురించిరి. CChTel 27.4

    1855 ప్రారంభములో “టెస్టిమొనీస్‌ ఫర్‌ ది చర్చ్‌” అను నామముతో ఒక పత్రికా పరంపర ప్రారంబమైనది. అప్పుడప్పుడు తన ప్రజలకు ఆశీర్వాదము, గద్దింపు, నడుపుదల పంపుటకు దేవుడు ఉద్దేశించిన ఉపదేశమును ఇవి అందించినవి. ఈ ఉపదేశములను ప్రజలు ఎక్కువగా కోరినందున 1885లో నవి నాలుగు పుస్తకములలో ప్రచురింపబడిన యితర సంపుటములను వీనికి చేర్చుటతో తొమ్మిది సంపుటములు గల “టెస్టిమొనీస్‌ ఫర్‌ ది చర్చ్‌” అను గ్రంథములు రూపొందినవి. CChTel 28.1

    వైటు దంపతులకు నలుగురు పిల్లలు కలిగిరి. జేష్ట పుత్రుడు హెన్రీ 16 సంవత్సరములు జీవించెను. కడసారి పిల్లవాడు హెర్బర్టు మూడు మాసములు ప్రాయమపుడు మరణించెను. మధ్య కుమారులిద్దరు ` ఎడ్సన్‌, విల్యమ్‌ ` పెరిగి పెద్దలై సెవెంతుడే ఎడ్వంటిస్టు మతశాఖా కార్యకలాపములను నిర్వహించిరి. CChTel 28.2

    జనరల్‌ కాన్ఫరెన్సువారి కోరికపై 1885 వేసంగిలో శ్రీమతి వైటమ్మగారు ఐరోపా వెళ్ళిరి. ఆ ఖండమందు నూతనముగా ప్రారంభమైన పనిని పటిష్టము చేయుచు ఆమె రెండు సంవత్సరములు గడిపిరి. స్విడ్జర్లాండులోని బేసల్‌ నగరమందు మకాముండి దక్షిణ, మధ్య సంవత్సరములు గడిపిరి. స్విడ్జర్లాండులోని బేసెల్‌ నగరమందు మకాముండి దక్షిణ, మధ్య, ఉత్తర ఐరోపా పర్యటించి, సంఘకూటములకు హాజరై, కూటములోనున్న సభికులను కలిసికొని వారితో ముచ్చటించిరి. CChTel 28.3

    సంయుక్త రాష్ట్రములలో నాలుగు సంవత్సరములున్న మీదట జనరల్‌ కాన్ఫరెన్సు వారి కోరికపై శ్రీమతి వైటమ్మగారు తన 63వ యేట ఆస్ట్రేలియాకు ఓడపై ప్రయాణమై వెళ్లిరి. అక్కడామె తొమ్మిది సంవత్సరములుండెను. అక్కడ ముఖ్యముగా ఆమె వైద్య, విద్యా సంస్థల స్థాపనకు వాని అభివృద్ధికి పాటుపడెను. వైటమ్మగారు 1900 సంవత్సరములో తిరిగి వచ్చి సంయుక్త రాష్ట్రములలో పశ్చిమ భాగమున నున్న కాలిఫోర్నియాలోని సెయింట్‌ హెలీనా అను పట్టణమందు స్థిర నివాస మేర్పరచుకొని 1915లో తాను మరణించువరకు అచర్చటనే యుండెను. CChTel 28.4

    వైటమ్మగారు 60 సంవత్సరములు అమెరికాలోను 11 సంవత్సరములు విదేశములలోను చేసిన సేవ యందు ఆమెకు సుమారు 2000 దర్శనములు కలిగెను. వ్యక్తులకు, సంఘములకు, బహిరంగ సమావేశములకు, జనరల్‌ కాన్ఫరెన్సు సమావేశములకు ఆమె నిర్విరామకృషితో చేసిన హితవుద్వారా ఈ దర్శనమలు ఈ ఉద్యమాభివృద్ధికి ఎక్కువగా తోడ్పడినవి. దేవుడిచ్చిన వర్తమానమును, ఉద్దేశించ బడిన వారందరికి అందజేయుపనిని ఆమె ఎన్నడును విరమించలేదు. CChTel 28.5

    ఆమె రచనలు మొత్తము 1,00,000 పుటలకు మించియున్నవి. ఆమె కలము నుండి వెలువడిన సందేశములు వ్యక్తిగత లేఖల ద్వారాను, మన మత పత్రికయందు వార వారము వెలువడిన వ్యాసములద్వారాను, అనేక గ్రంథముల ద్వారాను ప్రజలకు చేరినవి. ఆమె బైబిలు చరిత్ర, క్రైస్తవ దిన దినానుభవము, ఆరోగ్యము, విద్య, సువార్త సేన తదితర ప్రయోజనాత్మక అంశములపై ఉపదేశమునిచ్చెను. ఆమె వ్రాసిన 46 గ్రంథములలో ఎక్కువ భాగము ప్రపంచ ప్రాముఖ్య భాషలలో ముద్రించబడినవి. ఈ ప్రతులు లక్షల కొలది అమ్ముడు చేయబడుచున్నవి. CChTel 29.1

    తన 81వ ఏట వైటమ్మగారు 1909లో జరిగిన జనరల్‌ కాన్ఫరెన్సుకు హాజరగుటకు ఆఖరిసారి పశ్చిమ దిశనున్న తన స్వగ్రామము, సెయింట్‌ హెలీనా నుండి తూర్పు దిశనున్న వాషింగ్టన్‌కు వెళ్లిరి. ఆమె జీవితమందలి తక్కిన ఆరు సంవత్సరములు గ్రంథ రచనయందు వినియోగించబడినవి. అవసాన కాలమందు వైటమ్మగారీ మాటలను వ్రాసిరి: “నాకు మరణము తప్పినను, తప్పక పోయినను నా రచనలు నిత్యము మాటలాడును. లోకమున్నంత కాలము వాని పని అభివృద్ధి చెందును.” తిరుగులేని ధైర్యముతో తన రక్షకుని యందు పూర్ణ విశ్వాసముతో ఆమె తన స్వగృహమందు జూలై 16, 1915లో మరణించి మిషిగన్‌లోని బేటిల్‌ క్రీక్‌నందలి ఓక్‌హిల్‌ శ్మశాన వాటికలో తన భర్త ప్రక్క బిడ్డల ప్రక్క పాతిపెట్టబడెను. CChTel 29.2

    తన సహ సువార్త సేవకులచేతను, సంఘముచేతను, తన కుటుంబ సభ్యులచేతను వైటమ్మగారు మంచి తల్లి యనియు, పట్టుదల ఔదార్యము కలిగి నిర్విరామముగా సువార్తసేవ చేసిన వ్యక్తి యనియు గౌరవించబడిరి. ఆమె సంఘమునందు ఉద్యోగము చేయలేదు. తాను దేవుని వద్ద నుండి ఆయన ప్రజలకు వర్తమానము తెచ్చు “ఒక రాయబారిణి” యని ఆమె వ్యక్తపర్చుకొన్నది; సంఘము కూడ గుర్తించినది. తనను ఆదర్శముగా గొనుడని ఆమె ప్రజలను ఎన్నడును కోరలేదు8. లేక తన పరమును ఆర్థికలాభమున కైనను ప్రజాదరణను చూరగొనుటకైనను ఉపయోగించలేదు. తన జీవితము తన సర్వస్వము ఆమె దైవ సేవకు అంకితము చేసెను. CChTel 29.3

    “ఇండిపెండెంట్‌” అను ఒక ప్రఖ్యాత ఆంగ్ల వార పత్రికా సంపాదకుడు వైటమ్మ గారి ఫలభరితమైన జీవితమును గూర్చిన వ్యాఖ్యను ఆగస్టు 23, 1915 సంచికలో ఇట్లు ముగించెనుఫ “తనకు వచ్చిన ప్రత్యక్షతల యందలి తన విశ్వాసము విషయము ఆమె యథార్థవంతురాలు. ఆమె జీవితము ఆ ప్రత్యక్షతలకు తగినట్లుగానే యున్నది. ఆధ్యాత్మిక అహంభావము ఆమెకు లేదు. ధనాపేక్షగూడ లేదు. యోగ్యమైన ప్రవక్త్రికి తగినట్లు ఆమె జీవించి తన కర్తవ్యమును సాధించినది.”CChTel 29.4

    తాను మరణించక పూర్వము శ్రీమతి వైటమ్మగారు ఒక ధర్మ కర్తృత్వసంఘమును నియమించెను. ఇందు సంఘ ప్రముఖులు సభ్యులు. ఈ సంఘముపై తన రచనలను భద్రపరచి వానిని అవిచ్ఛిన్నముగా ప్రచురించు బాధ్యతను ఆమె మోసినది. వాషింగ్టన్‌ డి. సి. లో జనరల్‌ కాన్ఫరెన్సు కార్యాలయము కలదు. ఇది ఎడ్వంటిస్టు సంఘ ప్రధాన కార్యాలయము. ఇచ్చట ధర్మకర్తృత్వ సంఘ కార్యాలయము కూడా కలదు. ఈ ధర్మకర్తృత్వ సంఘము ఇ. జి. వైటమ్మ గారి గ్రంథములను ఆంగ్లమున ముద్రించి వానిని ఇతర భాషలలో సాకల్యముగానైనను కొన్ని భాగములైనను ప్రచురించుటకు ప్రోత్సహించుచున్నది. వైటమ్మగారి ఉపదేశానుసారము ఈ సంఘము వారు అప్పుడప్పుడు పత్రికలలో ప్రచరింపబడిన వ్యాసములను, వ్రాత ప్రతులను అనేక గ్రంథములుగా కూర్చి ప్రచురించిరి. ఈ సంఘపర్యవేక్షణ క్రిందనే యీ గ్రంథము ప్రచురింపబడుచున్నది. CChTel 30.1