Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    రెండు సైన్యములు

    రెండు సైన్యములు ఒక భయంకర యుద్ధములో పోరాడుట దర్శనమందు చూచితిని. లోకలాంఛనములుగల జెండాలతో ఒక సైన్యము నడిపించబడుచున్నది. మరియొక సైన్యము ఇమ్మానుయేలు యువరాజు రక్తపు మరకలుగల జండాతో నడిపంచబడు చున్నది. ప్రభువు సైన్యం నుండి పటాలము వెనుక పటాలము శత్రుపక్షమును చేరగా జెండా వెనుక జెండా ధూళిలో వేయబడి త్రొక్కబడుచుండగా శత్రుపక్షము నుండి గోత్రము వెనుక గోత్రము దైవాజ్ఞలు కాపాడు ప్రజలతో కలిసెను. ఆకాశ మధ్యమున ఎగురుచున్న దూర అనేక హస్తములలో ఇమ్మానుయేలు ధ్వజమును పెట్టెను. ఒక మహా సేనాని ఇట్లు పల్కెను. వరుసలోనికి రండి. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన సాక్ష్యమును గైకొను వారలారా ఇప్పుడు మీ స్థానములను ఆక్రమించుడి. వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపత్రమైన దానిని ముట్టకుడి. అప్పుడు నేను మిమ్మును అంగీకరించెదను. మీకు నేను తండ్రినై యుందును. మీరు నాకు కుమారులు కుమార్తెలునై యుందురు. ఇచ్ఛయించువారు ప్రభువు పక్షమునకు వచ్చి బలమైన శత్రువుతో పోరాడుటకు సాయము చేయుడి.” ఇప్పుడు సంఘము పోరాడుచున్నది. అర్థరాత్రి అంధకారముతో నిండిన ప్రపంచమును మనమిప్పుడెదుర్కొను చున్నాము. ఈ ప్రపంచము దాదాపు సంపూర్ణముగా విగ్రహారాధనయందు మునిగియున్నది. కాని ఒక దినము వచ్చుచున్నది. అప్పుడు యుద్ధము జరుగును. జయము సాధింపబడును. పరలోకములో నెరవేరుచున్నట్లు భూమిపై కూడ దేవుని చిత్తము నెరవేరవలెను. అప్పుడు లోక రాజ్యములు దైవ ధర్మ శాస్త్రమును వినా దేనిని తమ దిగా నేన్చురు. అందరు సంతోషపూరితమైన సమిష్టి కుటుంబముగా నుందురు. వారు క్రీస్తు నీతి వస్త్రమగు స్తుతి కృతజ్ఞతార్పణలను ధరించుకొనెదరు. అధిక సౌందర్యమును ధరించుకొని యావత్సృష్టి దేవునికి నితము స్తుతివందనములు చెల్లించును. పరలోక ప్రకాశముతో లోకము నింపబడును. సంవత్సరాములు ఆనందముగా గడుచును. చంద్రకాంతి సూర్యకాంతివాలే నుండును. సూర్యకాంతి ఇప్పటికన్నా ఏడు రెట్లు అధికమగును. ఆ దృశ్యములో ఉదయ నక్షత్రములు పాడును. దేవకుమారులు ఆనందధ్యానములు చేసెదరు. దేవుడును క్రీస్తును సంయుక్తముగ ఇట్లు పల్కెదరు. “పాపము మరణము ఇక ఉండవు.”CChTel 505.2

    నాకు చూప బడిన దృశ్యమిదే. దృశ్యమైన అదృశ్యమైన శత్రుసమూహముతొ సంఘము పోరాడవలెను పోరాడునుకుడ. మానవాకారములో సాతాను ప్రతినిధులు భూమిపైనున్నారు. సైన్యములకధిపతియగు యెహోవాను ప్రతిఘంచుటకు మానవులు ఖరారుపడి ఈ శత్రుకూతమి క్రీస్తు కృపాసనము నొద్ద తన విజ్ఞాపనము మాని ప్రతిదండన దుస్తులను ధరించు వరకు నిలిచి యుండును. సాతాను బలములు ప్రతి నగర మందును. గలవు. దైవ ధర్మ శాస్త్రమును వ్యతిరేకించు వ్యక్తులను కక్ష్యలుగా ఏర్పరచుటలో వారు నిర్వరామముగా పని చేయుచున్నారు. పరిశుద్దలమని చెప్పుకొను వారును అవిశ్వాసులును ఈ కక్ష్యలలో చేరెదరు. ఇప్పుడు దైప్రజలకు దుర్బలులుగా నుండరాదు. ఒక నిముసమయినను మనము అజాగ్రత్తగా నుండరాదు. 48T 41,42. CChTel 506.1